ఢిల్లీ సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ షాక్ ఇచ్చింది. ఆ రాష్ట్ర హోం, ఆరోగ్య శాఖ మంత్రి, ఆప్ పార్టీ సీనియర్ నేత సత్యేందర్ జైన్‌ను ఈడీ సోమవారం సాయంత్రం అరెస్ట్ చేసింది. ఆయనకు చెందిన ఓ కంపెనీలో మనీలాండరింగ్ లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేసింది. 2015–16 ఏడాదిల్లో ఆయన హవాలా నెట్వర్క్ ద్వారా రూ.4.81 కోట్లను సంపాదించినట్లు ఈడీ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈయన అరెస్ట్‌ను 2 నెలల క్రితమే కేజ్రీవాల్ అంచనా వేసి బిజెపిపై విమర్శలు చేశారు.