ఢిల్లీ పోలీస్: మృతురాలు స్కూటీపై ఒంటరిగా లేదు

By udayam on January 3rd / 5:22 am IST

కంఝవాలా కేసులో ఢిల్లీ పోలీసులు మంగళవారం ఉదయం కొత్త సమాచారం అందించారు. మృతురాలు స్కూటీపై ఒంటరిగా లేరని తెలిపారు. “మృతురాలిని ఈడ్చుకెళ్లిన మార్గాన్ని పరిశీలించినప్పుడు, ఆమె స్కూటీపై ఒంటరిగా లేరని తేలింది. ప్రమాదం జరిగిన సమయంలో మృతురాలితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయికి గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. మృతురాలి కాళ్లు కారులో ఇరుక్కుపోవడంతో కారు ఆమెను ఈడ్చుకెళ్లింది” అని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కారులో సౌండ్​ ఎక్కువ పెట్టుకోవడంతో ఆమె కారు కింద చిక్కుకున్నట్లు గుర్తించలేదని నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు.

ట్యాగ్స్​