సిద్ధూ గన్​మెన్​ కోసం నేపాల్​కు పోలీసులు

By udayam on June 3rd / 10:25 am IST

పంజాబీ సింగర్​ సిద్ధూ మూసావాలా హత్య కేసులో అతడి సొంత గన్​మెన్​ హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన రోజు నుంచి కనిపించకుండా పోయిన అతడి కోసం ఓ ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందం నేపాల్​ చేరుకుని అతడి జాడ కోసం అన్వేషిస్తోంది. గత ఆదివారం పంజాబ్​లోని మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామంలో మూసావాలా హత్య అనంతరం ఈ గన్​మెన్​ నేపాల్​ పారిపోయినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్​ చేసిన ఇద్దరు ఇచ్చిన వాంగ్మూలం మేరకు గన్​మెన్​ జాడను కనిపెట్టారు.

ట్యాగ్స్​