దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో వందన అనే 5వ తరగతి విద్యార్థినిపై టీచర్ గీతా దేశ్ వాల్ దారుణంగా దాడి చేశాడు. కత్తెరతో చిన్నారిని గాయపరిచి ఆపై బాల్కనీ నుంచి కిందకు నెట్టేశాడు. ప్రస్తుతం ఆ చిన్నారి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంఇ. ఈ ఉదయం 11.15 గంటల ప్రాంతంలోని ఢిల్లీలోని నగర్ నిగం బాలిక విద్యాలయలో ఈ ఘటన జరిగింది. మరో టీచర్ రియా.. ఈ ఘటనను ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.