ఢిల్లీ యాసిడ్​ ఘటన: ఫ్లిప్​ కార్ట్​, అమెజాన్​ లకు నోటీసులు

By udayam on December 15th / 9:22 am IST

ఢిల్లీలో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్​ళ చిన్నారిపై జరిగిన యాసిడ్​ దాడిలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. సచిన్​ అరోరా (20) ఈ ఏడాది సెప్టెంబర్​ నుంచి అమ్మాయిని వేధిస్తుండగా.. అతడితో పాటు బైక్​ పో హర్షిత్​ అగర్వాల్​ కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి వీరేందర్​ సింగ్​ సచిన్​ ఫోన్​ ను వేరే లొకేషన్లో ఉన్నట్లు చూపించడానికి బైక్​ పై ప్రయాణిస్తూ ఉండేవాడని పోలీసులు తెలిపారు. అయితే వీరు ఈ దాడికి వాడిన యాసిడ్​ ను ఫ్లిప్​ కార్ట్​ నుంచి కొన్నట్టు పోలీసులు తెలిపారు. సుప్రీం నిషేధ ఆదేశాలు ఉన్నప్పటికీ యాసిడ్​ అమ్మకాలు జరుపుతున్న ఫ్లిప్​ కార్ట్​, అమెజాన్​ సంస్థలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ట్యాగ్స్​