నైనిటాల్​ కన్నా చల్లగా ఢిల్లీ

By udayam on December 27th / 9:10 am IST

ఉత్తర భారతాన్ని చలి వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో నైనిటాల్‌కన్నా చల్లగా ఉందని అధికారులు తెలిపారు. మంగళవారం కనిష్ట ఉష్ణోగ్రతలు 5, 6 డిగ్రీల సెల్సియస్‌లకు పడిపోయిందని, ఇది సాధారణం కన్నా ఒక డిగ్రీ తక్కువగా ఉందని అధికారులు తెలిపారు. దృశ్యమానత కూడా కనిష్టానికి పడిపోయిందని అన్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిల్‌స్టేషన్‌ నైనిటాల్‌తో పోల్చితే, కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లలో కొన్ని ప్రాంతాలు దట్టమైన పొగమంచు కమ్మేసిందని అన్నారు.

ట్యాగ్స్​