అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ

By udayam on January 11th / 7:44 am IST

దేశంలోనే అత్యంత కలుషిత నగరంగా దేశ రాజధాని ఢిల్లీ మరోసారి చెత్త రికార్డును అందుకుంది. నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాం – ఎన్‌సీఏపీ 2022 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక్కడి గాలిలో సూక్ష్మధూళి కణ కాలుష్యం 2.5 పీఎం స్థాయులు సురక్షిత పరిమితి కంటే రెట్టింపు ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. అయితే, గత నాలుగేళ్లలో దిల్లీ కాలుష్యం ఏడు శాతం మేర తగ్గటం గమనార్హం. ఢిల్లీ తర్వాత క్యూబిక్‌ మీటరుకు 95.64 మైక్రోగ్రాములతో హరియాణాలోని ఫరీదాబాద్‌, 91.25 మైక్రోగ్రాములతో యూపీలోని గాజియాబాద్‌ 3వ స్థానంలో ఉన్నాయి.

ట్యాగ్స్​