కొండెక్కిన గోధుమ పిండి ధరలు

By udayam on May 9th / 7:51 am IST

దేశంలో ఇప్పటికే మండిపోతున్న పెట్రోల్​, డీజిల్​, వంటగ్యాస్​, నిత్యావసరాలు, వంటనూనెలకు తోడు ఇప్పుడు చపాతీ పిండి కూడా ఆకాశానికెక్కి కూర్చుంది. గత 30 రోజుల్లో గోధుమ పిండి సగటు రిటైల్​ ధర రూ.32లకు పైగా పెరిగి కేజీ రూ.59కి చేరింది. 2010 తర్వాత ఈ స్థాయిలో దీని రేటు పెరగడం ఇదే తొలిసారి. దేశంలో గోధుమల ఉత్పత్తి, నిల్వలు తగ్గడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో గోధుమ పిండికి డిమాండ్​ పెరుగుతోందని తెలిపారు.

ట్యాగ్స్​