డిఎస్పీ: చిరంజీవి ఇచ్చిన వాచ్​ తో నా టైం మారిపోయింది

By udayam on January 11th / 7:29 am IST

తన చిన్న తనంలో మెగాస్టార్​ ఇచ్చిన ఓ వాచ్​ తో తన జీవితం మారిపోయిందని అంటున్నాడు ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్​. వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్​ లో భాగంగా డైరెక్టర్​ బాబీ కి ఇంటర్వ్యూలో డిఎస్పీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ రోజు నాకున్న మ్యూజిక్​ సెన్స్​ గురించి మా నాన్న సత్యమూర్తి ద్వారా తెలుసుకున్న చిరంజీవి నన్ను చూడడానికి స్వయంగా మా ఇంటికి వచ్చారు. నేను మ్యూజిక్ ను ప్లే చేస్తూ ఉంటే, ఆయన చాలా సంతోషంగా ఆలా ఉండిపోయారు. ‘నేను సరదాగా చూద్దామని వచ్చాను .. అందువలన గిఫ్ట్ ఏమీ తీసుకురాలేదు .. ఇదిగో నీకు గిఫ్టుగా నా ఫేవరేట్ వాచ్ ఇస్తున్నాను” అంటూ తన చేతికి ఉన్న ఖరీదైన ప్లాటినం వాచ్ ను తీసి నా చేతికి పెట్టారు. అప్పటి నుంచి టైం మారిపోయింది అన్నారు డిఎస్పీ.

ట్యాగ్స్​