గుజరాత్​: గాయకుడు కీర్తిదాస్​ పై రూ.50 లక్షల నోట్ల వర్షం

By udayam on December 30th / 6:28 am IST

కళాకారుల ప్రదర్శనకు మంత్రముగ్ధులైన అభిమానులు వారిపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించిన ఘటన గుజరాత్​ లోని సుపా గ్రామంలో జరిగింది. నేత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి కోసం విరాళాల సేకరణ కోసం స్వామి వివేకానంద నేత్ర మందిర్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన భజన కార్యక్రమంలో గాయకుడు కీర్తి దాస్​ గధ్వి పై నోట్ల వర్షం కురిపించారు. ఇలా మొత్తంగా దాదాపు రూ. 50 లక్షలు సమకూరినట్టు ట్రస్ట్ పేర్కొంది. కాగా, సంగీత కచేరిలో అభిమానులు డబ్బులు వెదజల్లుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్​