రెండు నెలల క్రితం జబల్పూర్ విమానాశ్రయంలో ఓ విమానాన్ని రన్‌వే దాటించి నడిపిన ఇద్దరు పైలట్ల లైసెన్స్‌ను డిజిసిఎ ఏడాది పాటు రద్దు చేసింది. ఢిల్లీ–జబల్పూర్ వెళ్తున్న ఎటిఆర్–72 అనే విమానాన్నిమార్చి 12న ఈ పైలట్లు నడుపుతూ విధి నిర్వహణలో అలసత్వం వహించినట్లు డిసిజిఎ పేర్కొంది. ఈ విమానం జబల్పూర్ విమానాశ్రయంలో దిగాల్సిన స్థానం కంటే 900ల మీటర్ల ముందు ల్యాండ్ అయిందని అదే ఈ ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు.