వెంకటేష్​ తో ధమాకా డైరెక్టర్​..

By udayam on January 10th / 7:30 am IST

సినిమా చూపిస్తా మావ, హలో గురూ ప్రేమకోసమే, నేను లోకల్ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ నక్కిన త్రినాధరావు తాజాగా మాస్ రాజా రవితేజతో “ధమాకా” రూపొందించి సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ధమాకా ఘనవిజయంతో త్రినాధరావుకు ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయట. ఈ తరుణంలో టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇప్పటికే త్రినాధరావుని లాక్ చేసిందని టాక్. ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ గారు సినిమా చెయ్యబోతున్నట్టు లేటెస్ట్ బజ్ నడుస్తుంది.

ట్యాగ్స్​