ధమాకా ట్రైలర్ : కోట్లలో ఒకడు వాడు.. కొడితే కోలుకోలేవు

By udayam on December 16th / 5:14 am IST

మాస్​ మహరాజా రవితేజ లేటెస్ట్​ మూవీ ‘ధమాకా’ ట్రైలర్​ వచ్చేసింది. రవితేజ మార్క్​ డైలాగ్స్​, స్టైల్​, ఫైట్లతో ఈ ట్రైలర్​ ఆకట్టుకుంటోంది. శ్రీలీలతో రవితేజ కెమిస్ట్రీ బాగానే కుదిరింది. ఆనంద్​ చక్రవర్తి, స్వామి అనే రెండు క్యారెక్టర్లలో రవితేజ నటిస్తున్న ఈ మూవీలో వింటేజ్​ రవితేజ కనిపిస్తున్నాడు. ‘కోట్లలో ఒకడు వాడు.. కొడితే కోలుకోలేవు’ అంటూ వాయిస్​ ఓవర్లో వస్తున్న డైలాగ్​ బాగా పేలింది. డిసెంబర్​ 23న విడుదల కానున్న ఈ మూవీకి త్రినాథరావు డైరెక్టర్​.

ట్యాగ్స్​