తమిళ అగ్రనటుడు ధనుష్ తెలుగులో మూడో సినిమాకు ఒప్పుకున్నట్లు టాక్. శర్వానంద్ నటించిన శ్రీకారం మూవీ డైరెక్టర్ కిషోర్ రెడ్డి తో ధనుష్ కొత్త మూవీకి ఓకే చెప్పినట్లు సమాచారం. దిల్ రాజు ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే ధనుష్ వరుసగా ఇద్దరు తెలుగు డైరెక్టర్లను లైన్ లో పెట్టి సినిమాలు చేతున్నాడు. వెంకీ అట్లూరితో ‘సార్’ లో నటిస్తున్న ధనుష్.. ఆపై శేఖర్ కమ్ముల డైరెక్షన్లో కొత్త మూవీని సైతం ఇటీవలే మొదలు పెట్టాడు.