షూటింగ్​ కంప్లీట్​ చేసేసిన ‘సార్​’!

By udayam on December 24th / 4:19 am IST

టాలీవుడ్​ డైరెక్టర్​ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్​ నటిస్తున్న ‘సార్​’ షూటింగ్​ పార్ట్​ మొత్తం కంప్లీటయింది. తెలుగు, తమిళం భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ మూవీకి తమిళంలో ’వాతి’ అనే టైటిల్​ పెట్టారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న ఈ మూవీని రిలీజ్​ చేయనున్న సంగతి తెలిసిందే. సంయుక్తా మీనన్​ హీరోయిన్​ గా చేస్తోంది. సూర్యదేవర నాగవంశీ ఈ మూవీకి ప్రొడ్యూసర్​. ఈ మూవీ తర్వాత ధనుష్​.. శేఖర్​ కమ్ముల డైరెక్షన్లో ఓ కొత్త మూవీని చేయనున్నాడు.

ట్యాగ్స్​