త్వరలో పెళ్ళి భాజాలు?

By udayam on October 17th / 7:13 am IST

బాలీవుడ్​ ప్రేమ జంట విక్కీ కౌశల్​, కత్రినా కైఫ్​లు త్వలో పెళ్ళిపీటలు ఎక్కనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలోనే వీరిద్దరి ఎంగేజ్​మెంట్​ జరగబోతోందని విక్కీ తమ్ముడు సన్నీ కౌశల్​ హింట్​ ఇచ్చేశాడు. దీనిపై అడిగిన ప్రశ్నకు విక్కీ జవాబు చెబుతూ ‘త్వరలోనే నిశ్చితార్ధం జరగబోతోంది. ఇక టైం వచ్చేసింది’ అంటూ అసలు విషయం చెప్పకనే చెప్పేశాడు. ఇటీవల సర్దార్​ ఉద్దమ్​ అంటూ బాలీవుడ్​లో హిట్​ కొట్టిన విక్కీ ఆ సినిమాలో అతడి నటనకు ప్రశంసలు దక్కించుకున్నాడు.