జీ5: 20న ఎటిఎం లాంచ్​

By udayam on January 7th / 7:07 am IST

దిల్‌ రాజు వన్‌ ఆఫ్‌ ది ప్రొడ్యూసర్‌గా నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ పేరు ‘ఎటిఎం’. హీస్ట్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ వెబ్‌సీరిస్‌ను దర్శకుడు చంద్రమోహన్‌ జీ5 ఓటీటీ ప్లాట్‌ఫాం కోసం రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 20న ప్రీమియం చేస్తున్నట్లు మేకర్స్‌ ఓ వీడియో విడుదల చేశారు. దీనిలో బిగ్‌ బాస్‌ ఫేం వీజే సన్నీ, సుబ్బరాజు, రోయెల్‌ శ్రీ, రవిరాజ్‌, కృష్ణ బూర్గుల ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ను హర్షిత్‌ రెడ్డి, హన్షిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రశాంత్‌ ఆర్‌ విహార్‌ సంగీతం అందిస్తున్నారు.

ట్యాగ్స్​