108 ర్యాంకులు మెరుగైన దినేష్​ కార్తీక్​

By udayam on June 22nd / 11:03 am IST

సూపర్​ ఫామ్​లో ఉన్న భారత సీనియర్​ క్రికెటర్​ దినేష్​ కార్తీక్​ ఐసిసి టి20 ర్యాంకింగ్స్​లో 108 ర్యాంకులు మెరుగయ్యాడు. ప్రస్తుతం కార్తీక్​ 87వ స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో భారత యువ ఓపెనర్​ ఇషాన్​ కిషన్​ మాత్రం టాప్​ 10 ర్యాంకింగ్స్​లో కొనసాగుతున్నాడు. భారత్​ తరపున టాప్​10 లో ఉన్న ఏకైక ప్లేయర్​ ఇషాన్​ మాత్రమే. ప్రస్తుతం అతడు 6వ ర్యాంకుకు చేరుకున్నాడు. పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ ఆజాం అగ్రస్థానంలో ఉన్నాడు.

ట్యాగ్స్​