5:23 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

కోల్​కత్తా కెప్టెన్సీకి దినేష్ కార్తీక్​ రాం..రాం.. కొత్త కెప్టెన్​గా ఇయాన్​ మోర్గాన్​ 2 weeks ago

ఐపిఎల్​ 2020 సీజన్లో కోల్​కతా నైట్​ రైడర్స్​ ఆడిన సగం మ్యాచ్​లకు కెప్టెన్​గా వ్యవహరించిన దినేష్​ కార్తీక్​ ఆ పదవి నుంచి తప్పుకుని కెప్టెన్సీని ఇయాన్​ మోర్గాన్​కు అప్పగించాడు.

‘‘కెప్టెన్సీ భారం నుంచి తప్పుకుంటున్నా. దీంతో బ్యాటింగ్​ పై మరింత శ్రద్ధ పెట్టడానికి అవకాశం దొరుకుతుంది”అని వ్యాఖ్యానించాడు.
అయితే ఇప్పటికే 7 మ్యాచ్​లకు కెప్టెన్​గా వ్యవహరించిన కార్తీక్​ జట్టుకు 4 విజయాలను అందించాడు. దీంతో కోల్​కతా పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. ఈరోజు ముంబైతో జరగనున్న మ్యాచ్​కు ముందు కార్తీక్​ తీసుకున్న నిర్ణయం క్రికెట్​ అభిమానులను ఆశ్చర్యపరిచింది.

దీనిపై ఆ జట్టు సిఇఓ వెంకీ మైసూర్​ మాట్లాడుతూ.. ‘‘జట్టు కోసమే ఆలోచించే కార్తీక్​ లాంటి ప్లేయర్​ మా టీంలో ఉండడం మా అదృష్టం. ఇక నుంచి కార్తీక్​, ఇయాన్​ మోర్గాన్​లు కలిసి జట్టును ముందుకు నడిపిస్తారు”అని వ్యాఖ్యానించాడు.

ఇంగ్లాండ్​ వన్డే జట్టు కెప్టెన్​ అయిన ఇయాన్​ మోర్గాన్​ 2019లో జరిగిన వన్డే ప్రపంచకప్​ను గెలిచాడు. అతడిని కెకెఆర్​ గత డిసెంబర్​లో జరిగిన వేలంలో 5.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇప్పటి దాకా మోర్గాన్​ 7 మ్యాచ్​లకు గానూ 30 సగటుతో 175 పరుగులు చేశాడు. కార్తీక్​ 15.42 సగటుతో 108 పరుగులు చేశాడు.

2017లో 7.4 కోట్లు పెట్టి కార్తీక్​ను కొనుగోలు చేసిన కెకెఆర్​ 2017లో సైతం సరిగ్గా టోర్నీ మధ్యలోనే గంభీర్​ను కెప్టెన్సీ నుంచి తప్పించి కార్తీక్​కు పగ్గాలప్పగించింది. అయితే 2018లో జట్టును నాలుగో స్థానంలో నిలిపిన కార్తీక్​ గత సీజన్​లో ప్లే ఆఫ్స్​కు చేర్చలేకపోయాడు.

అయితే ఈ సీజన్​ మొదలయ్యే సమయానికే అందరికీ గంభీర్​ను కెకెఆర్​ జట్టు ఈసారి టోర్నమెంట్​ మొత్తానికి కెప్టెన్​గా కొనసాగించకపోవచ్చునన్న అభిప్రాయం వచ్చేసింది. సునీల్​ గవాస్కర్​ సైతం ఇదే విషయాన్ని ఐపిఎల్​ సీజన్​ మొదలవ్వడానికి ముందే వ్యాఖ్యానించడం గమనార్హం.