కరువు దెబ్బకు బయటపడ్డ డైనోసార్​ పాదముద్రలు

By udayam on August 26th / 5:41 am IST

అమెరికాలోని టెక్సస్ ప్రాంతంలో నెలకొన్న తీవ్ర కరవు మూలంగా ఓ అద్భుతం బయటపడింది. అక్కడ 11.3 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్ల పాదముద్రల్ని గుర్తించారు. దాదాపు పూర్తిగా ఎండిపోయిన ఒక నది ఒడ్డున వీటిని నిపుణులు కనుగొన్నారు. భారీగా ఉన్న ఈ అడుగుల గుర్తులు అక్రోకాంతోసారస్‌ జాతికి చెందిన డైనోసార్లకు చెందినవిగా నిపుణులు పేర్కొన్నారు. వీటికే మూడు బొటనవేళ్ళు ఉండేవని, ఒక్కో దాని బరువు 700 కిలోల బరువు, 4.5 మీటర్ల ఎత్తు ఉండేవని తెలిపారు. ఈ పార్క్​లో మొత్తం 140 పాదముద్రలు ఉన్నట్లు గుర్తించారు.

ట్యాగ్స్​