తొలి సినిమా ఉప్పెన తోనే తానేంటో నిరూపించుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సన.. ఇప్పుడు ఏకంగా ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా నటుడిగా ఎదిగిన రామ్ చరణ్ ను డైరెక్ట్ చేయనున్నాడు! ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న #RC15 షూటింగ్ పూర్తయిన వెంటనే బుచ్చిబాబు మూవీ ప్రారంభం కానుందని సమాచారం. ఈ మూవీని కొత్త నిర్మాత సతీష్ కిలారు నిర్మించనున్నాడు.