మహేష్ బాబుతో తాను తెరకెక్కించిన చిత్రంలోని కొన్ని డైలాగులు నరసింహ స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్లు ఉంటే క్షమించాలని డైరెక్టర్ పరశురామ్ విజ్ఞప్తి చేశాడు. హిందువులకు ఆరాధ్యుడైన విష్ణు మూర్తి అవతారంపై ‘సర్కారు వారి పాట’ చిత్రంలో ఉన్న కొన్ని సంభాషణలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంపై పరశురామ్ స్పందిస్తూ క్షమాపణలు చెప్పాడు. ‘లక్ష్మీ నరసింహస్వామి గంథపు చెక్క పూత ఎందుకు పూసుకుంటాడో తెలుసా’ అంటూ విలన్ చెప్పే డైలాగ్ ఈ వివాదానికి కారణం.