రాధేశ్యాం మేకింగ్ వీడియో వైరల్

By udayam on November 20th / 12:35 pm IST

హైదరాబాద్: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ అక్టోబర్‌లో ఇటలీ షెడ్యూల్‌ షూటింగ్‌ను పూర్తి చేసుకుని  ప్రస్తుతం రామోజీ ఫీల్మ్‌ సిటీలో చివరి షెడ్యూల్‌ను జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ మేకింగ్‌ వీడియో ‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. నీలిరంగు స్క్రీన్​ ఉన్న ఈ వీడియోకు ‘మా చిత్ర బృందంతో నీలి రంగు తెరపై’ అనే క్యాప్షన్‌ను జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుంది. అంతేగాక సచిన్‌ ఖేడేకర్‌, ప్రియదర్శి, భాగ్యశ్రీ, మురళీ శర్మ, సత్యన్‌ శివకూమార్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫీలిం సిటీలో క్లైమాక్స్‌ సీన్‌లన రూపొందిస్తున్నారు. అయితే  క్లైమాక్స్‌ సీన్‌ల కోసం దాదాపుగా 30 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా సెట్స్‌ వేస్తున్నారు.  ఆస్కార్‌ విన్నింగ్‌ హాలీవుడ్‌ మూవీ ‘గ్లాడియేటర్‌’కి యాక్షన్‌ కొరియోగ్రఫీ అందించిన నిక్‌ పోవెల్‌ ‘రాధేశ్యామ్‌’కు వర్క్‌ చేస్తున్నాడు.  ఈ షూటింగ్‌ అయ్యాక  ప్రభాస్ తర్వాతి  ‘అదిపురుష్‌’ షూటింగ్‌ లో జాయిన్ అవుతాడు.