రష్యా ఆయిల్​తో రూ.35 వేల కోట్ల లాభం!

By udayam on September 20th / 5:52 am IST

ఉక్రెయిన్​పై యుద్ధానికి దిగిన రష్యా నుంచి డిస్కౌంట్​ పేరుతో భారీ ఎత్తున చమురును కొంటున్న భారత్​ ఈ క్రమంలో రూ.35 వేల కోట్ల నిధులను మిగుల్చుకుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి భారత్​ రష్యా నుంచి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేస్తోంది. దీంతో జూన్​, జులై నెలల్లో రష్యా మనకు రెండో అతిపెద్ద చమురు దిగుమతి దారుగా మారింది. ఆపై ఈ స్థానాన్ని ఆగస్ట్​లో సౌదీ అరేబియా తిరిగి దక్కించుకుంది. గతేడాది ఇదే సమయంలో రష్యా నుంచి 1.2 బిలియన్ల చమురును కొన్న మనం.. ఈ ఏడాదిలో 11.2 బిలియన్ల చమురును డిస్కౌంట్​ ధరకు కొనుగోలు చేశాం.

ట్యాగ్స్​