గుజరాత్​ కాంగ్రెస్​కు హార్ధిక్​ పటేల్​ రాజీనామా

By udayam on May 18th / 8:44 am IST

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు గుజరాత్​ కాంగ్రెస్​లో పెను కుదుపు సంభవించింది. గుజరాత్​ కాంగ్రెస్​ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు హార్ధిక్​ పటేల్​ ట్వీట్​ చేశారు. కాంగ్రెస్​ తనను వాడుకుని వదిలేసిందంటూ చాలా కాలంగా ఆయన పార్టీపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ‘పిసిసి మీటింగులకూ పిలవరు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందూ నన్ను సంప్రదించరు. అలాంటప్పుడు ఇక నాకు ఈ పదవి ఉండి ఏం ప్రయోజనం’ అని హార్ధిక్​ ప్రశ్నించారు.

ట్యాగ్స్​