టిడిపి తనను కుక్కపిల్లలా తిప్పకుని, కరివేపాకులా వాడుకుని వదిలేసిందని నటి దివ్య వాణి అన్నారు. టిడిపికి రాజీనామా చేయడానికి గల కారణాలను వెల్లడించిన ఆమె.. నారీభేరీ వంటి మీటింగ్లకు మేకప్ వేసుకుని కూర్చోవడమే తన పని కాదన్నారు. గతంలో అచ్చెన్నాయుడు, సాధినేని యామిని సైతం టిడిపిని విమర్శించారని వారిపై చర్యలెక్కడ? అంటూ ఆమె నిలదీశారు. మహానాడులో కనీస గౌరవమూ దక్కలేదన్న ఆమె పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.