జమ్మూ కశ్మీర్ : డీజీపీ హత్య కేసులో పనిమనిషి అరెస్ట్

By udayam on October 4th / 9:46 am IST

జమ్మూకశ్మీర్ జైళ్ల డైరక్టర్ జనరల్ హేమంత్ లోహియా అనుమానాస్పద మరణానికి సంబంధించి.. ఆయన వద్ద పని చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడైన 23 ఏళ్ల యాసిర్ లోహార్ కోసం పోలీసులు రాత్రంతా గాలింపు నిర్వహించారని, రాంబాన్ జిల్లాలోని కన్హాచాక్ ప్రాంతంలో అతడిని అరెస్ట్ చేశారని జమ్మూ పోలీసులు తెలిపారు. నిందితుడు యాసిర్ రాంబాన్ జిల్లాలోని హల్లా దాంద్రాత్ గ్రామ నివాసిగా గుర్తించారు. హేమంత్ లోహియా మృతదేహాన్ని సోమవారం రాత్రి జమ్మూ శివార్లలోని ఆయన స్నేహితుడి నివాసంలో కనుగొన్నారు. ఇది హత్య కేసు అని అధికారులు చెప్తున్నారు.

ట్యాగ్స్​