వంటగ్యాస్ ధరను ఈరోజు మరోసారి చమురు సంస్థలు పెంచేశాయి. ఈనెల 7న 14.2 కేజీల సిలిండర్ ధరపై రూ.50 పెంచిన చమురు కంపెనీలు ఈరోజు మరో రూ.3.50 చొప్పున ధరను పెంచాయి. పెంచిన ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయని సైతం స్పష్టం చేశాయి. ఈ పెంపుతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1000 దాటేసింది. హైదరాబాద్‌లో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1055 కు చేరుకోగా.. ఢిల్లీలో రూ.1000 మార్క్‌ను చేరుకుంది.