జూనియర్ ట్రంప్ కి కరోనా

By udayam on November 21st / 2:55 pm IST

వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ట్రంప్ కుమారుడికి ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్ అని రావడంతో అతను హోం క్వారంటైన్ లో ఉన్నారు.

42 ఏళ్ల వయసుగల డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కు కరోనా లక్షణాలు లేకున్నా పాజిటివ్ అని వచ్చిందని వైద్యులు చెప్పారు. కొవిడ్ -19 మార్గదర్శకాల ప్రకారం డొనాల్డ్ ట్రంప్ జూనియర్ హోం క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సిఫారసు చేశారు. గతంలో డొనాల్డ్ ట్రంప్, అతని భార్య మెలానియా ట్రంప్ లకు కూడా కరోనా సోకింది.