విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చవద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఫ్లెక్సీలతో యూనివర్సిటీని నింపేయడం ఏం సూచిస్తోందని ప్రశ్నించారు. విశ్వ విద్యాలయాలు విద్యార్థులను సామాజిక, రాజకీయ, ప్రాపంచిక విషయాలపై చైతన్యవంతులను చేయాలి. కానీ ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలు ఆ బాధ్యతను విస్మరించి అధికార పార్టీ కార్యకర్తలను తయారుచేసే పనిలో ఉన్నాయా అనే సందేహం కలుగుతోందన్నారు.
Don’t convert universities into ruling party offices! – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/sb9N2kxh9Z
— JanaSena Party (@JanaSenaParty) December 22, 2022