తెలంగాణలో నేటి నుంచి మరోసారి ఇంటింటి ఫీవర్ సర్వే జరపనున్నారు. కొవిడ్ 19 లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు ప్రభుత్వం ఈ సర్వేను చేపడుతోంది. ఈ సర్వేలో లక్షణాలు ఉన్న వారికి అక్కడే హోం ఐసోలేషన్ కిట్స్ అందించి వారికి మెడిసిన్స్ కూడా ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ప్రతిరోజు పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో ఈ సర్వేను నిర్వహించి తక్షణ ట్రీట్మెంట్ను అందించనున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.