షోలాపూర్​ : పెళ్ళికావట్లేదని కలెక్టరేట్​ వద్ద యువకుల నిరసన

By udayam on December 22nd / 9:17 am IST

మహారాష్ట్రలోని షోలాపుర్‌ జిల్లాలో పెళ్లి కాని యువకులు వింత నిరసన చేపట్టారు. వివాహాలు చేసుకోటానికి రాష్ట్రంలో తగిన సంఖ్యలో అమ్మాయిలు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. క్రాంతి జ్యోతి పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనకు పెళ్లి కాని యువకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. గుర్రాలపై ఊరేగింపుగా వచ్చి శోలాపుర్‌ కలెక్టరేటు ఎదుట బైఠాయించారు. మహారాష్ట్రలో లింగ నిష్పత్తి సమానంగా లేకపోవడానికి లింగ నిర్ధరణ చట్టం పటిష్ఠంగా అమలు కాకపోవటమే కారణమని వీరు ఆరోపించారు.

ట్యాగ్స్​