డాక్టర్​ రెడ్డీస్​ లాభాల్లో 76 శాతం కోత

By udayam on May 19th / 10:44 am IST

దేశంలోనే దిగ్గజ ఫార్మా కంపెనీ డాక్టర్​ రెడ్డీస్​కు నాలుగో త్రైమాసిక లాభాల్లో 76 శాతం కోత పడింది. ఈ త్రైమాసికంలో కేవలం 88 కోట్ల రూపాయల లాభాన్ని మాత్రమే ఆర్జించింది. ఇంపైర్​మెంట్​ ఛార్జెస్​ రూపంలో రూ.751.5 కోట్లను చెల్లించాల్సి రావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. గతేడాది పోల్చితే కంపెనీ ఆదాయం 15 శాతం పెరిగి రూ.5,437 కోట్లకు చేరిందని కంపెనీ పేర్కొంది. దీంతో కంపెనీ ఒక్కో షేరుపై రూ.30 డివిడెండ్​ను ప్రకటించింది.

ట్యాగ్స్​