ఐఎన్​ఎస్​ విశాఖ నుంచి బ్రహ్మాస్​ పరీక్ష

By udayam on January 12th / 5:07 am IST

ఇటీవలే నేవీలోకి చేరిన ఐఎన్​ఎస్​ విశాఖపట్నం నుంచి ఈరోజు బ్రహ్మాస్​ సూపర్​ సోనిక్​ మిస్సైల్​ను డిఆర్​డిఓ అధికారులు విజయవంతంగా పరీక్షించారు. అనుకున్న లక్ష్యాన్ని ఈ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో ఛేధించిందని డిఆర్​డిఓ ప్రకటించింది. ఈ ప్రయోగం విజయం కావడంతో భారత నౌకాదళం మరింత శత్రు దుర్భేధ్యమైందని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ హర్షం వ్యక్తం చేశారు. ఇదేరోజు మాన్​ పోర్టబుల్​ యాంటీ టాంక్​ గైడెడ్​ మిస్సైల్​ను కూడా డిఆర్​డిఓ విజయవంతంగా పరీక్షించింది.

ట్యాగ్స్​