‘ఆకాష్​’మే హద్దు

By udayam on July 22nd / 2:36 am IST

భారత్​ తన సొంతంగా అభివృద్ధి చేసిన రెండు క్షిపణుల్ని బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ముందుగా భూమి నుంచి గాలిలోని లక్ష్యాలను ఛేధించే ‘ఆకాష్​’ క్షిపణిని ఒడిషా లోని ఇంటిగ్రేటెడ్​ టెస్ట్​ రేంజ్​ నుంచి విజయవంతంగా ప్రయోగించింది. అనంతరం యాంటీ ట్యాంక్​ గైడెడ్​ మిస్సైల్​ కు సైతం విజయవంతంగా పరీక్షలు జరిపింది. ఆత్మనిర్భర్​ భారత్​లో భాగంగా ఈ పరీక్షల్ని నిర్వహించినట్లు డిఆర్​డిఓ ప్రకటించింది.

ట్యాగ్స్​