హైదరాబాద్​లో నీటి సరఫరాకు అంతరాయం

By udayam on May 31st / 9:18 am IST

జూన్​ 1, 2 తేదీల్లో హైదరాబాద్​ వాసులకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. సింగూర్ ఫేజ్​–3 పైప్​లైన్​ లీకేజీలకు మరమ్మత్తుల కారణంగా 2 రోజుల పాటు పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్​ అవుతుందని జల మండలి సోమవారం ప్రకటించింది. బుధవారం ఉదయం 6 నుంచి గురువారం ఉదయం 6 వరకూ మంచినీటి సరఫరా నిలిచిపోతుందని పేర్కొంది. శంకర్​ పల్లి వద్ద మూడు చోట్ల మరమ్మత్తులు జరుగుతుండడమే ఇందుకు కారణమని పేర్కొంది.

ట్యాగ్స్​