ఢిల్లీలో డ్రైవర్​ లెస్​ మెట్రో ట్రైన్లు

By udayam on November 26th / 10:20 am IST

ప్రపంచంలోనే 4వ అతిపెద్ద మెట్రో రైల్​ నెట్​వర్క్​ అయిన ఢిల్లీలో ఈరోజు డ్రైవర్​ లెస్​ ట్రైన్​ను ప్రవేశపెట్టారు. ఈ ట్రైన్​ కోసం ఢిల్లీ మెట్రో 59 కి.మీ.ల ప్రత్యేక పింక్​ లైన్​ను సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హర్దీప్​ సింగ్​ పూరి, కైలాష్​ గెహ్లాట్​లు హాజరయ్యారు. ఈ 59 కి.మీ.ల పింక్​లైన్​తో కలిపి ఢిల్లీ మెట్రోలో ఆటోమేటెడ్​ లైన్​ పొడవు 97 కి.మీ.లకు పెరిగింది. మానవ తప్పిదాలను తగ్గించేందుకే ఈ ఆటోమేటెడ్​ ట్రైన్​లను ప్రవేశపెడుతున్నట్లు మెట్రో సంస్థ ప్రకటించింది.

ట్యాగ్స్​