పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలోకి ప్రవేశించిన పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్‌ను బీఎస్ఎఫ్ దళాలు కూల్చివేశాయి. పాక్ డ్రోన్ బుధవారం ఉదయం 7.20 గంటలకు భారత్ భూభాగంలోకి ప్రవేశించింది. బీఎస్ఎఫ్ దళాలు పాక్ డ్రోన్‌ను కౌంటర్ చేయడంతో భరోపల్ బార్డర్ అవుట్‌పోస్ట్‌కు 20 మీటర్ల దూరంలో పాక్ భూభాగంలో డ్రోన్ కూలిపోయింది. ఆ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలను పసిగట్టేందుకు బీఎస్ఎఫ్ సోదాలు ముమ్మరం చేసింది. 2021లో సరిహద్దు వెంబడి 104 డ్రోన్లను బీఎస్ఎఫ్ గుర్తించగా ఈ ఏడాది 230 డ్రోన్లను గుర్తించింది.