శ్రీశైలం మల్లన్న సేవలో రాష్ట్రపతి ముర్ము

By udayam on December 26th / 12:53 pm IST

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్​ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆమె సున్నిపెంటలో ల్యాండ్​ అయిన ఆమెకు తెలంగాణ గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​, ఏపీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్​, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిలు స్వాగతం పలికారు.అక్కడి నుంచి రాష్ట్రపతి రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకున్నారు. అక్కడ సాక్షి గణపతి ఆలయంలో పూజలు నిర్వహించి, భ్రమరాంబిక అతిథి గృహానికి చేరుకున్నారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం… శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ట్యాగ్స్​