వైరల్​ వీడియో: మద్యం మత్తులో పోలీసులను తన్నిన యువతి

By udayam on December 16th / 6:48 am IST

విశాఖ బీచ్ రోడ్డులో ఓ యువతి మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో బీచ్ రోడ్డులోని వైఎంసీఏ వద్ద జరిగిన ఈ ఘటనలో తాగడం ఆపి, అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పిన పోలీసుల మాటలకు ఆమె వీరావేశంతో ఊగిపోయింది. నన్నే ప్రశ్నిస్తారా?.. నా ‘ఏటీఎం’కు చెప్పి మీ డిపార్ట్‌మెంట్ అంతు చూస్తానంటూ బూతులు తిట్టింది. అక్కడితో ఆగకుండా ఏఎస్ఐ సత్యనారాయణను కాలితో తన్నింది. అది చూసిన అక్కడే ఉన్న యువకుడు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయగా అతడిని బీరు సీసాతో గాయపరిచింది. దీంతో మహిళా పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్​