టెస్టుల్లో డబుల్ సెంచరీలు చేసే జో రూట్.. ఆటగాళ్ళ వేలంలోనూ డబుల్ బొనాంజా కొట్టాడు. ఇప్పటి వరకూ ఏ ఒక్క అంతర్జాతీయ టి20 లీగ్ ల్లోనూ అమ్ముడుపోని ఈ ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ .. శుక్రవారం ఒక్కరోజే రెండు దేశాల్లో జరిగిన టి20 లీగ్ వేలాల్లో అమ్ముడుపోయాడు. కొచ్చిన్ లో జరిగిన ఐపిఎల్ మినీ వేలంలో తొలిసారిగా అమ్ముడుపోయిన రూట్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.1 కోటికి దక్కించుకుంది. అంతకు ముందు రూట్ ను దుబాయ్ లోని ఇంటర్నేషనల్ లీగ్ టి20 లో దుబాయ్ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది.