పర్యటక రంగానికి ఊతమిచ్చేలా దుబయి కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్కహాల్‌పై అక్కడ విధించే 30 శాతం పన్నును రద్దు చేసింది. అంతేకాదు.. దుబయిలో నివసించేవారు ఇంట్లోనే మద్యం సేవించడానికి కావాల్సిన లైసెన్సుల కోసం చార్జీలు వసూలు చేయడం ఆపేయనున్నారు. దుబయిలో కొద్దిరోజులుగా ఆల్కహాల్‌కు సంబంధించిన చట్టాలకు సడలింపులు ఇస్తున్నారు. రంజాన్ సమయంలో పగటిపూట కూడా విక్రయించుకునేందుకు అనుమతులు ఇవ్వడం, కరోనా మహమ్మారి సమయంలో హోం డెలివరీ చేయడం వంటివన్నీ ఈ సడలింపులలో భాగమే.