ఘంటసాల రత్నాకర్​ కన్నుమూత

By udayam on June 10th / 8:56 am IST

లెజెండరీ సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు తనయుడు ఘంటసాల రత్నకుమార్​ ఈరోజు గుండెపోటుతో మరణించారు. డబ్బింగ్​ ఆర్టిస్ట్​గా చిరపరితులైన రత్నకుమార్​ ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈరోజు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. దాదాపు 1000కు పైగా తెలుగు, తమిళం, మళయాళం, హిందీ సినిమాలకు ఆయన డబ్బింగ్​ ఆర్డిస్ట్​గా పనిచేశారు. వీటితో పాటు తెలుగు, తమిళ టివి సీరియల్స్​, కార్టూన్లకు సైతం ఆయన డబ్బింగ్​ చెప్పారు.