5:39 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఆరంభం 2 weeks ago

విజయవాడ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాలు శనివారం ప్రారంభం అయ్యాయి. తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ నిర్వహించారు. విజయవాడ సిటీ  పోలీసు కమిషనర్‌ శ్రీనివాసులు దంపతులు శుక్రవారం కనకదుర్గమ్మకు పవిత్ర సారె సమర్పించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

ఈవేళ ఉదయం 9 గంటలకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. రాత్రి 8 గంటల వరకూ కొనసాగుతాయి. మిగతా రోజుల్లో ఉదయం 5 నుంచి దర్శనాలకు అనుమతి ఇస్తారు. కోవిడ్ నిబంధనలు అనుసరించి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.
ఉత్సవాల్లో తొలిరోజున అమ్మవారు స్వర్ణకవచాన్ని ధరించి దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి రోజుకు పదివేలమందిని అనుమతించాలని ఇప్పటికే ఆలయ అధికారులు నిర్ణయించారు.

ఆర్జిత సేవలను కూడా  పరోక్షంగా నిర్వహిస్తున్నారు. మాస్క్‌ ధరించి, ఆన్‌లైన్‌ టికెట్, ఐడీ కార్డు ఉంటేనే క్యూలైన్‌లోకి పంపిస్తారు. కరోనా నేపథ్యంలో పదేళ్లలోపు చిన్నారులను, 60 ఏళ్లు దాటిన వారిని దర్శనానికి నో ఎంట్రీ. క్యూలైన్‌లో ఇతరులు తాకిన వస్తువులు తాకవద్దంటూ బోర్డులను ఏర్పాటు చేశారు.

దగ్గు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండే వారిని జర్వంతో బాధపడుతున్నదీ లేనిదీ పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే క్యూలైన్‌లోకి అనుమతిస్తారు. దుర్గామాల ధరించిన భక్తులు తమ గ్రామాల్లోనే దీక్షల ఇరుముడులు సమర్పించాలి. భక్తులు మంచినీటి బాటిల్స్‌ తెచ్చుకోవాలి. అత్యవసరాల కోసం క్యూలైన్‌లో మంచినీటి క్యాన్లు ఉంచారు. నిషేధించారు. కోవిడ్‌ నేపథ్యంలో దుర్గగుడి వద్ద కృష్ణానదిలో దుర్గాఘాట్, ఇతర ఘాట్‌లలో పుణ్యస్నానాలు, తలనీలాల సమర్పణపై దేవదాయశాఖ ఆంక్షలు విధించింది.