వయసు మీద పడ్డ తర్వాత వచ్చే కంటి సంబంధిత సమస్యలు కానీ, గుండె జబ్బులు గానీ మన కళ్ళు అందరికంటే ముందు గుర్తిస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. న్యూయార్క్ ఐ, ఇయర్ సర్వే పేరిట విడుదలైన ఈ నివేదికలో ఏజ్ రిలేటెడ్ మాక్కులర్ డిజనరేషన్ వ్యాధితో పాటు గుండెపోటును కూడా కళ్ళు ముందుగానే గుర్తిస్తాయని పేర్కొంది. గుండెపోటుతో పాటు గుండెలో వాల్వ్ సరిగ్గా పనిచేయకపోవడం, కరోటిడ్ ఆర్టెరీ వ్యాధి, వివిధ రకాల స్ట్రోక్స్ ను కూడా కళ్ళలో ఉండే ప్రత్యేక వ్యవస్థ ముందుగానే తెలుసుకుంటుందని తేలింది.