జమ్ముకశ్మీర్‌లో భూకంపం

By udayam on January 9th / 6:44 am IST

జమ్ముకశ్మీర్‌లో మరోసారి భూమి కంపించింది. ఆదివారం రాత్రి 11.15 గంటలకు కిష్ట్‌వార్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 3.6గా నమోదైంది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. దీనివల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరుగలేదు. కాగా, గత 10 రోజుల్లో జమ్ముకశ్మీర్‌లో భూకంపం రావడం ఇది మూడోసారి. జనవరి 1, 5 తేదీల్లో భూకంపం దాటికి జమ్మూకశ్మీర్ వణికింది.

ట్యాగ్స్​