ఆఫ్ఘన్​ లో భూకంపం.. భారత్​ లోనూ కంపించిన భూమి

By udayam on January 6th / 5:49 am IST

ఆఫ్ఘనిస్థాన్ లోని హిందూకుష్ పర్వతశ్రేణిలో భూకంపం సంభవించింది. ఫైజాబాద్ కు దక్షిణంగా 79 కిలోమీటర్ల దూరంలో భూఉపరితలం నుంచి 200 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. దీని ప్రభావంతో భారత్, పాకిస్థాన్ దేశాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంతో పాటు హర్యానా, రాజస్థాన్, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. రాత్రి 7.50 గంటల సమయంలో ఢిల్లీలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది.

ట్యాగ్స్​