జమ్మూ కాశ్మీర్లోని కత్రాలో బుధవారం రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, భూకంపం స్థానం కత్రాకు తూర్పు ఆగ్నేయ దిశలో 74 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఉదయం 9:15 గంటలకు సంభవించింది.ఈ సందర్భంగా భూకంప తీవ్రతను తెలియజేస్తూ… భూకంప శాస్త్ర కేంద్రం ట్వీటర్ ద్వారా వివరాలను తెలియజేసింది. అంతకుముందు, సెప్టెంబర్ 8 న, రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూకంపం జమ్మూ కాశ్మీర్లోని కత్రాకు తూర్పు -ఈశాన్య-తూర్పుగా 62 కి.మీ దూరంలో సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.