సైక్లోన్​ అసాని : ఆంధ్రా–ఒడిశాలు అప్రమత్తం

By udayam on May 7th / 4:01 am IST

దక్షిణ అండమాన్​ సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం శుక్రవారం తుపానుగా మారుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఒడిశా అప్రమత్తమైంది. వచ్చే వారం ఈ తుపాను ఆంధ్రా–ఒడిశాల మధ్య తీరం దాటుతుందన్న వార్తల నేపధ్యంలో తుపానును ఎదుర్కోవడానికి ఆ రాష్ట్రం అన్ని విధాలా సిద్ధమవుతోంది. ఆదివారం సాయంత్రానికే తుపాను తీవ్రరూపం దాల్చుతుందని, మే 10వ తేదీన తీరం దాటుతుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తుపానుకు శ్రీలంక సూచించిన ‘అసాని’ పేరును పెట్టనున్నారు.

ట్యాగ్స్​