రాజ్యసభలో తెలంగాణ నుంచి ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ విడుదల చేసింది. మే 12న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. నామినేషన్లకు తుది గడువుగా మే 19వ తేదీని నిర్ణయించింది. 30వ తేదీన పోలింగ్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ జరుగుతుంది. జూన్ 1న ఓట్ల లెక్కింపు అనంతరం విజేతను వెల్లడిస్తారు. టిఆర్ఎస్ అభ్యర్థి బండ ప్రకాష్ ఎమ్మెల్సీగా వెళ్ళడంతో.. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.